మహేష్ బాబు, బన్నీ సినిమాలతో టాలీవుడ్‌లో బిజీగా ఉన్న రష్మికను కోలీవుడ్లో ఒక సినిమాకు తీసుకున్నారట తమిళ సూపర్ స్టార్. దీంతో రష్మిక కోలీవుడ్లో కూడా దూసుకుపోతానంటోంది. రష్మికకు ఇప్పుడు యూత్‌లో ఎంతో క్రేజ్ ఉంది. గీత గోవిందంలో మేడంగా మురిపించిన రష్మికకు కన్నడ నాట కూడా బోలెడంత పాపులారిటీ. అంటే... సౌత్ ఇండియాలో ఆమెకు క్రేజ్ ఉంది. అందుకే ఇప్పుడు కోలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆమె కోసం క్యూ కడుతున్నారు.