మా డ్యాన్స్ ఆ హీరోకు అంకితం...నితిన్ అండ్ రష్మిక..నెటిజన్లు ఫిదా (video)

శుక్రవారం, 27 డిశెంబరు 2019 (13:26 IST)
టాలీవుడ్‌‌లో యంగ్‌ హీరోలలో ఒకరైన నితిన్‌, ఇప్పుడి బిజీ హీరోయిన్‌గా మారిన ముద్దుగుమ్మ రష్మిక మందన జంటగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. 
 
రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని  దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయిన ఈ సినిమాను ఫిబ్రవరి 21న విడుదల చేయాలని భావిస్తోంది ఈ సినిమా యూనిట్. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో పాటల షూటింగ్ మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో రెండు పాటల షూటింగ్‌ కోసం రోమ్‌ వెళ్లిన భీష్మ టీం అక్కడి అప్‌డేట్స్‌ను పోస్ట్ చేస్తూ సందడి చేస్తున్నారు.  
 
తొలి సాంగ్‌ డిసెంబర్ 27న రానుందని క్లారిటీ ఇస్తూ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతుండగానే బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్ నటించిన 'వార్' చిత్రంలోని 'గుంగ్రూ' అనే పాటకు నితిన్‌, రష్మికలు డ్యాన్స్‌ చేసి, దాన్ని హృతిక్‌కు అంకితమిచ్చారు. తాజా ఈ వీడియోను రష్మిక తన అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేయగా తెగ వైరల్ అవుతోంది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు