వరుస సినిమాలు, విజయాలతో చాలా సంతోషంగా ఉంది రష్మిక మందన. గ్యాప్ దొరికితే చాలు తన స్నేహితులతో తెగ ఎంజాయ్ చేసేస్తోంది రష్మిక. సినిమా ప్రారంభం నుంచి ముగిసే వరకు జోష్‌గానే పనిచేస్తానంటోంది రష్మిక. అయితే సినిమా నిర్మాత కన్నా డైరెక్టర్ కోసమే తాను ఎప్పుడూ కష్టపడుతూ ఉంటానని చెబుతోంది రష్మిక.
అందుకే డైరెక్టర్ ఎంత కష్టమైన సన్నివేశం ఇచ్చినా చేయగలను. బాష తెలియకపోయినా నేను ఆ సన్నివేశంలో ఒదిగిపోయే విధంగా చేసి తీరుతాను. గీత గోవిందం సినిమాలో నాకు బాష రాకపోయినా నేను నటించిన కొన్ని సన్నివేశాల్లో నేను చూపించిన హావభావాలు అందరినీ బాగా అలరించాయి. నన్ను బాగా మెచ్చుకున్నారు. డైరెక్టర్ నా దగ్గర అలాంటి సన్నివేశాలు చేయించారంటోంది రష్మిక.