మళ్ళీ రాశీ ఖన్నా రెడీ అయింది... కొత్త విన్యాసాలు చూపుతుందట...

శనివారం, 10 అక్టోబరు 2015 (18:51 IST)
రాశీ ఖన్నా ఈసారి ఏకంగా ఖాకీ డ్రెస్‌లో కన్పిస్తుంది. మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం సుప్రీమ్‌. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తుండగా, పటాస్‌ ఫేమ్‌ అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో రాశి ఖన్నా పోలీస్‌ పాత్రలో సందడి చేయబోతోంది. ఆమెపై కొన్ని యాక్షన్‌ సీన్స్‌ కూడా ఉన్నాయి. 
రాశి ఖన్నా
 
ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న షెడ్యూల్‌లో ఈ యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరి రాశిఖన్నా చేసే విన్యాసాలు చూడాలంటే కొద్దికాలం ఆగాల్సిందే. మరి ఈ చిత్రంతోనైనా రాశి ఖన్నాకు మంచి బ్రేక్‌ వస్తుందేమో చూడాలి.

వెబ్దునియా పై చదవండి