రెండేళ్ల గ్యాప్‌తో రవితేజ చేసిన "రాజా ది గ్రేట్" హిట్ టాక్ సొంతం చేసుకోగా కొన్నిచోట్ల డిస్ట్రిబ్యూటర్స్‌కు బ్రేక్ ఈవెన్ రాలేదని అంటున్నారు. అయితే ఓవరాల్‌గా సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. "బెంగాల్ టైగర్" తర్వాత రవితేజ చేసిన ఈ సినిమా మాస్ రాజా క్రేజ్ మరింత పెంచేసింది. అందుకే రెమ్యునరేషన్ కూడా పెంచాడట. తన దగ్గరకు వస్తున్న నిర్మాతలకు రూ.10 కోట్లు ఇస్తేనే సినిమా అంటున్నాడట రవితేజ.
రవితేజకు అన్ని కోట్లు అంటే సినిమా బడ్జెట్ ఎంతలేదన్నా రూ.30 కోట్లకు చేరుకుంటుంది. ఆ చిత్రానికి హిట్ టాక్ వస్తేనే పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయి. లేదంటే నిర్మాతతో పాటు పంపిణీదారులు కూడా నష్టాలను చవిచూడాల్సిందే. కానీ, తన రెమ్యునరేషన్ విషయంలో రవితేజ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. అందుకే పలు ఆఫర్లను కూడా కోల్పోతున్నాడట. మొత్తానికి రవితేజ రెమ్యునరేషన్ షాక్‌తో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.