మాస్ మహారాజా రవితేజ, ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో స్పెషలిస్ట్ అయిన త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ధమాకా'తో డబుల్ ఇంపాక్ట్ ఎంటర్ టైన్మెంట్ ని అందించడానికి సిద్ధంగా వున్నారు. అత్యున్నత ప్రమాణాలు, భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించడంలో పేరుపొందిన టిజి విశ్వ ప్రసాద్ ఈ కమర్షియల్ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో సినిమాలోని యాక్షన్ యాంగిల్ ఎక్కువగా చూపించారు. రవితేజ ద్విపాత్రాభినయం చేస్తూ డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ ఈరోజు లాంచ్ చేశారు.