ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని పాత్ర చేశా - ర‌వితేజ‌

మంగళవారం, 19 జులై 2022 (15:22 IST)
Raviteja
మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన తాజా సినిమా `రామారావు ఆన్ డ్యూటీ`. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌కుడు. ఈ చిత్రంలో ర‌వితేజ ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని పాత్ర పోషించాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న మంగ‌ళ‌వారంనాడు చెబుతూ, నేను చాలా సినిమాలు చేశాను. కానీ నేను ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని క్యారెక్ట‌ర్ ఇది. మాజీ క్యారెక్ట‌ర్‌. నాకూ కొత్త‌గా వుంది. ఇంత‌కుముందు గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస‌ర్‌గా పోలీస్ అధికారిగా చేశాను.
 
కానీ మొద‌టిసారిగా ప్ర‌భుత్వం ఎంప్లాయ్‌గా చేశారు. 1990లో ఓ ఊరిలో తాలూకాఫీసులో జ‌రిగిన నేప‌థ్యంలో వుంటుంది. దీనికి సంబంధించిన ఆర్ట్ డిపార్ట‌మెంట్ చాలా కృషి చేశారు. అప్ప‌టి ఫ‌ర్నిచ‌ర్‌, అప్ప‌టి సి.ఎం., గ‌వ‌ర్న‌ర్ ఫొటోలు ఆఫీసులో వుండేలా, ర‌క‌ర‌కాల వ్య‌క్తులు ఆఫీసులో ప‌నిచేసేలా త‌గు చ‌ర్య‌లు తీసుకున్నారు. ఇలాంటి పాత్ర ఇప్ప‌టి యూత్‌కు బాగా న‌చ్చుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ని అన్నారు. ఈ సినిమా ఈనెల 29న విడుద‌ల కాబోతోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు