రామారావు ఆన్ డ్యూటీతో రీ ఎంట్రీ ఇస్తున్న వేణు తొట్టెంపూడి

బుధవారం, 6 జులై 2022 (16:48 IST)
Venu Thottempudi
కొంత విరామం తర్వాత నటుడు వేణు తొట్టెంపూడి, మాస్ మహారాజా రవితేజ యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ' తో తిరిగి వెండితెరపై సందడి చేయబోతున్నారు.  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
 
ఈ చిత్రంలో వేణు చాలా కీలకమైన పాత్రను పోషించారు. ఆయన క్యారెక్టర్ పోస్టర్‌ ను విడుదల చేశారు నిర్మాతలు. ఈ పోస్టర్ లో సీఐ మురళిగా వేణు కాస్త సీరియస్‌ గా కనిపిస్తున్నారు. ఈ పాత్ర దాదాపు సినిమా మొత్తం రవితేజతో కలిసి ప్రయాణిస్తుంది.
 
ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతుండగా, మేకర్స్ ఇప్పటివరకు విడుదల చేసిన మూడు పాటలు సంగీత ప్రియులను అలరించాయి. ముఖ్యంగా మూడో సింగిల్ 'నా పేరు సీసా' మాస్ ని మెస్మరైజ్ చేసింది. త్వరలోనే ఈ సినిమా టైటిల్ సాంగ్‌ ని విడుదల చేయనున్నారు. సామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్‌సి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు
 
ఈ చిత్రాన్ని జూలై 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు