స్వాతి నాయుడు. యూట్యూబ్లో రొమాంటిక్ షార్ట్ఫిల్మ్స్ చూసే వారిందికి పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఈ హాట్ భామ నటించిన 'క్యాంపస్ అంపశయ్య' త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఒంటిపై నూలు పోగు (న్యూడ్) కూడా లేకుండా నటించి, సంచలనం సృష్టించింది. ఈమె ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.
పనిలోపనిగా ప్రఖ్యాత స్టార్ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్పై సుతిమెత్తని విమర్శలు చేసింది. శృతి హాసన్ ఎక్స్పోజింగ్ ఏ రేంజ్లో చేస్తుందో ప్రతి ఒక్కరికీ తెలుసు. చిన్న చిన్న బట్టలు వేసుకుని అంగాంగ ప్రదర్శన చేయడానికి అంత పెద్ద స్టార్ కూతురికే లేని అభ్యంతరం నాకెందుకు. ఆమే చేయగా లేంది.. డబ్బు కోసం నేను చేస్తే తప్పా అని సూటింగా ప్రశ్నించింది.