'ఖైదీ నెం.150' ఏమీ బాగోలేదన్న రాంగోపాల్ వర్మపై మెగా ఫ్యాన్స్ ఫైర్

మంగళవారం, 23 ఆగస్టు 2016 (13:04 IST)
మెగాస్టార్ చిరంజీవి సుదీర్ఘకాలం తర్వాత 150వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖైదీ నంబర్ 150' అనే టైటిల్‌ను చిత్ర యూనిట్ ఖరారు చేసింది. అయితే, ఈ టైటిల్‌పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తన స్పందనను తెలియజేస్తూ.. చిరంజీవి నటిస్తున్న 150వ సినిమా టైటిల్ 'ఖైదీ నెం.150' ఏమీ బాగోలేదంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహంతో ఆయనపై దుమ్మెత్తిపోశారు.
 
ఆ వెంటనే తేరుకున్న ఆర్జీవీ... ఏమాత్రం సిగ్గుపడకుండా, భయపడకుండా సారీ చెప్పేశారు. "ఈ ఫస్ట్ లుక్ చూశాక గతంలో నేను చేసిన విమర్శలకు మెగా ఫ్యాన్స్‌కు అపాలజీ చెబుతున్నాను. అసలు మెగాస్టార్ కెరీర్లోనే ఇది బెస్ట్ లుక్. సూపర్‌గా వుంది... రాకింగ్..." అంటూ వర్మ తాజాగా ట్వీట్ చేస్తూ చిరంజీవి సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా పోస్ట్ చేశాడు. 

వెబ్దునియా పై చదవండి