అలాంటి ఫోటోలకు వర్మ తల అంటించాడు.. అంతే పోలీసులు అరెస్ట్ చేశారు..

శుక్రవారం, 25 మే 2018 (15:18 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వద్ద స్క్రిప్ట్ రైటర్‌గా పని చేసిన జయకుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగ్నంగా ఉన్న అమ్మాయిల బొమ్మలకు తన తలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి కించపరుస్తున్నారని రాంగోపాల్ వర్మ ఇచ్చిన ఫిర్యాదుపై విచారించిన హైదరాబాద్, పంజాగుట్ట పోలీసులు జయకుమార్‌ను అరెస్టు చేశారు.
 
రెండు సంవత్సరాల క్రితం రాంగోపాల్ వర్మ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ చేరారు జయకుమార్‌ అయితే కొద్ది కాలానికే వర్మ అతన్ని పనిలోనుంచి తీసేశాడు. దీంతో కక్ష గట్టిన జయకుమార్.. యువతుల అసభ్యకర చిత్రాలకు రాంగోపాల్‌వర్మ తలను పెట్టి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడమే కాకుండా.. అసభ్యకరంగా కామెంట్లు పెట్టాడు. ఇది జయకుమార్ పనేనని అతనిపై రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేశాడు. 
 
చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన జయకుమార్ 2014 నుంచి 2017 మధ్య కాలంలో వర్మ వద్ద స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేశాడు. తనను అవమానించాడంటూ, తన పరువు తీశాడంటూ సదరు వ్యక్తిపై పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో న్యాయస్థానం అనుమతి తీసుకున్న పోలీసులు జయ కుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణను ప్రారంభించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు