ఆగస్టు 1న ఫ్రెండ్ షిప్‌డేనాడు రాజమౌళి విడుదలచేసిన `ఆర్.ఆర్.ఆర్.`లోని దోస్త్ సాంగ్‌కు అనూహ్య స్పందన వచ్చింది. ఐదు భాషల్లో విడుదలైన ఈ పాట ఏకంగా 20 మిలియన్లకు చేరుకుంది. పాటను విడుదల చేస్తూ ఎస్ఎస్ రాజమౌళి “ఈ స్నేహ దినం రెండు శక్తివంతమైన ప్రత్యర్థి శక్తులు – రామరాజు, భీమ్ దోస్తీ కలిసి రావడం సాక్షిగా” అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియో సాంగ్ లో సంగీత దర్శకులు అమిత్ త్రివేది, ఎంఎం కీరవాణి, అనిరుధ్, విజయ్ ఉన్నారు. ఈ వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా కన్పించి సర్ప్రైజ్ ఇచ్చారు. ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖ సింగర్స్ పాడిన ఈ మనోహరమైన పాటను ఎంఎం కీరవాణి స్వరపరిచారు.