చెర్రీకి అదిరిపోయే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ యూనిట్
శుక్రవారం, 26 మార్చి 2021 (17:00 IST)
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం అదిరిపోయేలా సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. మే 27వ తేదీన చెర్రీ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు. ఈసందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం సర్‌ప్రైజ్ ఇచ్చింది.
తాజాగా ఈ సినిమాలో చరణ్ పోషిస్తున్న సీతారామరాజు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామారజు పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా ఉంటుందో తాజా పోస్టర్‌తో లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా దర్శక ధీరుడు రాజమౌళి చెప్పకనే చెప్పాడు.
సోషల్ మీడియా ద్వారా 'ఆర్ఆర్ఆర్' నుంచి చరణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన కొద్ది సేపట్లోనే యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుంటూ ట్రెండ్ అవుతోంది.
ఈ పోస్టర్‌కి రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ ధైర్యానికి, సమగ్రతకి నిర్వచనం అయిన అల్లూరి సీతారామరాజు పోషిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ పేర్కొన్నాడు. ఇక ఈ సినిమాలో కొమరం భీంగా నటిస్తున్న ఎన్.టి.ఆర్ కూడా ట్వీట్ చేస్తూ చరణ్‌కి శుభాకాంక్షలు తెలిపాడు.
Bravery, honour and integrity.
A man who defined it all!
It's my privilege to take on the role of #AlluriSitaRamaraju