EE kathalo patralu kalpitam prerelease
పవన్ తేజ్ కొణిదెల, మేఘన జంటగా నటించిన సినిమా `ఈ కథలో పాత్రలు కల్పితం`. అభిరామ్ ఎమ్. దర్శకత్వంలో మాధవి సమర్పణలో ఎంవిటి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాజేష్ నాయుడు నిర్మించారు. ఈనెల 26న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి గీతరచయిత చంద్రబోస్, అంబర్ పేట్ శంకరన్న, బోరబండ సత్యం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ర్యాప్ సింగర్ నోయెల్, హుషారు ఫేమ్ హీరో దినేష్ తేజ్, డాన్స్ మాస్టర్ యష్ తదితరులు ముఖ్య అతిధులుగా వచ్చారు.