ఇదిలా ఉంటే.. బాహుబలి మొదటి భాగంతో పోలిస్తే, రెండో భాగం నూటికి నూరు శాతం అద్భుతమని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సెన్సార్ బోర్డు సభ్యుడు, సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధూ తన సామాజిక మాధ్యమ ఖాతా ట్విట్టర్ ద్వారా స్పందించారు. సినిమా ఫలితంపై మంచి స్పందన వస్తోందని, టాలీవుడ్‌కు, ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే సమయం దగ్గర పడిందని చెప్పారు.
మరోవైపు కట్టప్ప కన్నడిగులకు సారీ చెప్పారు. దీంతో కన్నడలో బాహుబలికి రూట్ క్లియర్ అయ్యింది. అయితే ఈ గొడవలు తమిళనాడుకు పాకాయి. తాజాగా విడుదలైన కన్నడ చిత్రాలను ప్రదర్శిస్తున్న పలు థియేటర్ల వద్దకు వచ్చిన తంబీలు, బలవంతంగా చిత్ర ప్రదర్శనను ఆపివేశారు. ఈ గొడవ పెను వివాదమయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.