అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న సాహో సెన్సార్ పూర్తి చేసుకున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి, కానీ నిర్మాతలు ఇంకా ధ్రువీకరించలేదు. కంటెంట్ దృష్ట్యా ఎటువంటి కట్స్ లేకుండా అయితే ఏ మార్క్, లేదా కొన్ని చెప్పిన మార్పులు చేస్తే యు/ఎ ఇస్తామని అధికారులు చెప్పినట్టుగా టాక్ ఉంది. ఒకవేళ ఏ ఇస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది.
రిలీజ్‌కు ఇంక కేవలం 9 రోజులు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఇదో తీవ్రమైన అడ్డంకిగా ఉండకూడదనేది యువి ఆలోచన. దీనికి సంబంధించి స్పష్టత ఈరోజు లేదా రేపు వచ్చే అవకాశం ఉంది. సినిమా నిడివి ఇప్పటికే 2 గంటల 52 నిమిషాలు అనే టాక్ ఉంది. ఒకవేళ ఫైనల్ కట్‌లో ఏమైనా తగ్గించారేమో చూడాలి. ప్రస్తుతానికి అలాంటి సూచనలైతే కనిపించడం లేదు.