అది లవ్ మ్యారేజ్ కూడా కావొచ్చు.. ప్రభాస్

మంగళవారం, 20 ఆగస్టు 2019 (16:44 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో అంత సులభంగా చేరుకోలేని ఎత్తుకు ఎదిగిన యువ స్టార్ ప్రభాస్ తన సిసిమాలతో అందరినీ అలరిస్తున్నప్పటికీ. పెళ్లి విషయంలో మాత్రం ఆలస్యం చేస్తున్నారు. ఈ విషయంలో వస్తున్న పుకార్లను కొట్టివేస్తూ కూల్‌గా సమాధానం ఇస్తున్నారు. ఆనుష్క‌తో పెళ్లి దాదాపు ఫిక్స్ అయినట్టే అని గతేడాది మీడియా వర్గంలో ప్రచారం జరిగినా అదంతా అబద్ధం అని ప్రభాస్, అనుష్కలు ఖండించారు.  
 
అయినా కూడా పుకార్లకు కొదువ లేకుండా పోయింది. తాజాగా సాహో ప్రమోషన్స్‌లో ఊపిరాడనంత బిజీగా ఉన్న ప్రభాస్‌కు ఇక్కడా అదే ప్రశ్న ఎదురవుతోంది. అనుష్క కానీ ఇంకో అమ్మాయికానీ తన జీవితంలో అడుగు పెట్టలేదని పెళ్లి చేసుకోవాల్సి వస్తే అందరికి చెప్పే చేసుకుంటానని ప్రభాస్ స్పష్టంగా బదులిచ్చారు. అది లవ్ మ్యారేజ్ కూడా కావచ్చని చెప్పారు. 
 
పెదనాన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజు కూడా వీటి గురించి రెస్పాండ్ అయ్యారు. ఎవరో ఎన్ఆర్ఐతో ఫిక్స్ కావొచ్చని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అసలు ఆ ఆలోచనే లేదని తగిన జోడి కోసం తమ కుటుంబం వెతుకుతోందని స్పష్టత ఇచ్చారు. 
 
కాబట్టి ప్రభాస్ మ్యారేజ్ విషయంలో సస్పెన్స్ వీడలేదు, గత కొన్నేళ్లుగా ఇదే సమాధానంతో నెట్టుకొస్తున్న ప్రభాస్ ఈసారైనా సాలిడ్‌గా పెళ్లి చేసేసుకుని భార్యను చూపిస్తే తప్ప ఇలాంటి ప్రచారాలకు బ్రేక్ పడేటట్టు లేదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు