రకుల్ ప్రీత్ సింగ్.. సాయిధరమ్ తేజ్‌తో కొత్త సినిమా చేస్తున్నా: మలినేని గోపిచంద్

శుక్రవారం, 3 జూన్ 2016 (17:35 IST)
సినిమాకు కాంబినేషన్లు.. సెంటిమెంట్లు ముఖ్యం. ఒకసారి అనుకున్న ప్రాజెక్ట్‌ కొద్దిరోజులకు వర్కవుట్‌ కాకపోవచ్చు. ఈలోగా.. సినిమాకు ఏవో అడ్డంకులు వచ్చినా.. వాయిదా పడుతుంటాయి. బలుపు, పండగ చేస్కో.. చిత్రాల దర్శఖుడు మలినేని గోపీచంద్‌ చాలా గ్యాప్‌ తీసుకున్నాడు. ఇందుకు తను ఇద్దరు హీరోలకు చెప్పిన కథ.. రొటీన్‌ మాస్‌ చిత్రంగా వుండడంతో వద్దనుకున్నట్లు తెలిసింది. దాంతో.. కొత్త హీరో అయినా.. సాయిథరమ్‌తేజ్‌తో ఓకే చేయించాడు.
 
అతని బాడీ లాంగ్వేజ్‌ను బట్టి కథను మార్చి ఎంటర్‌టైన్‌ చేసే విధంగా మలిచాడు. మంచిరోజులు లేవని.. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. రకుల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మధు, నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా ఈ చిత్రం వాయిదాపడినట్లు వార్తలు వచ్చాయి. అందుకు వెంటనే గోపీచంద్‌ వివరణ ఇస్తూ.... ఆ వార్తలో నిజంలేదని.. త్వరలో సెట్‌పైకి వెళ్ళనుందనీ.. ఒక చిత్రం తెరకెక్కించాలంటే అన్నీ అనుకూలించాలనీ.. దానివల్ల ఆలస్యమవుతుందని చెబుతున్నాడు. 

వెబ్దునియా పై చదవండి