మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా రిలీజ్ డేట్ ఖరారైంది. దర్శకుడు బీవీఎస్ రవి రూపొందించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కానున్నట్లు సినీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలోని సాయిధరమ్ తేజ్, మెహరీన్‌ల పలు పోస్టర్‌లను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.