తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతల్లో 'దిల్' రాజు ఒకరు. గత యేడాది ఏ నిర్మాత కూడా తీయనన్ని చిత్రాలను దిల్ రాజు నిర్మించారు. ఈ ఆరు చిత్రాలూ సూపర్ డూపర్ హిట్లే. ఇందులో 'ఫిదా', 'ఎం.సి.ఏ' చిత్రాల్లో సాయి పల్లవి హీరోయిన్. అలాంటి సాయి పల్లవి ఇపుడు దిల్ రాజుకు తేరుకోలేని షాక్ ఇచ్చిందట.
తన కోసం అని చెప్పిన పాత్రకు అంతగా ప్రాముఖ్యత లేని కారణంగా తాను చేయలేనని సాయిపల్లవి తెగేసి చెప్పేసిందట. దాంతో దిల్ రాజు - హరీష్ శంకర్ ఇద్దరూ కూడా ఇప్పుడు ఆలోచనలో పడినట్టుగా చెప్పుకుంటున్నారు. నితిన్‌తో దిల్ రాజు చేయనున్న 'శ్రీనివాస కల్యాణం' సినిమాలోనూ సాయిపల్లవిని అనుకోవడం.. ఆమె నో చెప్పడం తెలిసిందే. ఇపుడు మరోమారు సాయి పల్లవి నో చెప్పడం ఫిల్మ్ నగర్‌లో చర్చనీయాంశంగా మారింది.