Father: భార్యతో గొడవ.. ముగ్గురు బిడ్డల్ని పెట్రోల్ పోసి కాల్చేశాడు.. ఆపై పురుగుల మందు తాగి?

సెల్వి

గురువారం, 4 సెప్టెంబరు 2025 (17:58 IST)
కుటుంబ కలహాల కారణంగా నలుగురు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అందులో ముగ్గురు పిల్లలు ఉండటం తీవ్ర విషాదంగా మార్చింది. కుటుంబ కలహాల కారణంగా ఓ తండ్రి.. ముగ్గురు పిల్లలను చంపి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. ఏపీ, ప్రకాశం, యర్రగొండపాలేం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు, దీపిక దంపతులు. వీరికి మోక్షిత (8), వర్షిణి (6) ఇద్దరు కుమార్తెలు, శివధర్మ(4) ఓ కొడుకు ఉన్నారు. 
 
భార్యతో గొడవల కారణంగా శ్రీశైలానికి పిల్లలతో వెళ్లిన వెంకటేశ్వర్లు 31న ఉప్పునుంతల మండలం సూర్యతండా సమీపంలో చిన్నకుమార్తె వర్షిణి, కుమారుడు శివధర్మపై పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. 
 
ఆ తర్వాత కల్వకుర్తి మండలం తాండ్ర సమీపంలో పెద్దకుమార్తె మోక్షితను కూడా అదే తరహాలో చంపేశాడు. అనంతరం కల్వకుర్తి పట్టణానికి వెళ్లి పురుగుల మందు కొనుక్కొని తాగాడు. దీంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై వెంకటేశ్వర్లు సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరిపారు. 
 
దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయరహదారికి ఇరువైపులా ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగించాయి. ఈ క్రమంలో కాలిపోయిన స్థితిలో చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆపై వెంకటేశ్వరుడి మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు