మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం తేజ్ ఐ లవ్ యూ. ఎ.కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పైన కె.ఎస్.రామారావు ఈ సినిమాని నిర్మించారు. వరుస ఫ్లాపులతో డీలాపడ్డ తేజు ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా కోసం రెమ్యూనరేష్ ఏమీ తీసుకోకుండా... కేవలం తన ఖర్చులకు మాత్రమే కొంత ఎమౌంట్ తీసుకుని ఈ సినిమా చేసాడట. సినిమా హిట్ అయితే.. అసలు వడ్డీతో సహా ఇచ్చేందుకు కె.ఎస్.రామారావు రెడీగా ఉన్నారట.
ఇదిలా ఉంటే... మెగా అభిమానులు సెంటిమెంట్ ప్రకారం తేజ్ సినిమా హిట్ అవుతుంది అంటున్నారు. ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే... మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌కి పవన్ కళ్యాణ్ టైటిట్ తొలిప్రేమ కలిసొచ్చింది. సినిమా సక్సస్ అయ్యింది. ఇప్పుడు తేజుకి తొలిప్రేమ దర్శకుడు కరుణాకరన్ ప్రేమకథ, కధనం కలిసొచ్చి విజయాన్ని అందిస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి... ఇది నిజం అవుతుందో లేదో చూడాలి..!