ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మనీష్ శర్మ మాట్లాడుతూ టైగర్ 3లో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ బిగ్గెస్ట్ యాక్షన్ పెయిర్ టైగర్ పాత్రలో సల్మాన్ ఖాన్, జోయా పాత్రలో కత్రినా కైఫ్ నటించారు. ఇది వారిద్దరి కథ. వారిద్దరూ కలిసినప్పుడు సంఘర్షణ ఉంటూనే వస్తుంది. వారి మధ్య బంధం పెరిగే కొద్ది ఈ సంఘర్షణ పెరిగిందే కానీ తగ్గలేదు. టైగర్ 3లో ఈ సంఘర్షణ ఇంకా బలంగా కనిపించనుంది.
అందుకు తగినట్లు యాక్షన్ సన్నివేశాలు మెప్పించనున్నాయి. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు ధీటుగా టైగర్ 3లో సన్నివేశాలు మెప్పించనున్నాయి. సినిమాలో సల్మాన్, కత్రినా పాత్రలు ఎదుర్కొనే సమస్యల్లో ఉండే తీవ్రత వల్ల సినిమా చాలా వేగవంతంగా సాగుతుంది. ఈ మూవీలో 12 అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలున్నాయి. ఇవి ప్రేక్షకులు సీట్ ఎడ్జ్‌లో కూర్చొనిపెట్టి చూసేలా చేేస్తాయి. ఇక అద్భుతమైన క్లైమాక్స్ ఉంటుంది. టైగర్, జోయా ఫ్యాన్స్‌కైతే ఇదొక ట్రీట్‌లా ఉంటుంది. ఐమ్యాక్స్‌లో ఈ యాక్షన్ సీన్స్ అబ్బురపరుస్తాయి అన్నారు.