బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్న మాజీ దంపతులు (video)

శుక్రవారం, 6 మే 2022 (14:57 IST)
టాలీవుడ్ మాజీ దంపతులు అక్కినేని నాగచైతన్య, సమంతలు బాక్సాఫీస్ వద్ద పోటీపడుతున్నారు. వీరిద్దరు వేర్వేరుగా నటించిన రెండు చిత్రాలు ఒక్క రోజు తేడాతో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సమంత నటించిన "యశోద", నాగ చైతన్య నటించిన "లాల్ సింగ్ చద్దా"లు ఆగస్టు 12న విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు. 
 
సమంత ప్రధాన పాత్రలో హరి - హరీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "యశోద". ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ప్రధాన పాత్రను పోషించారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. 
 
అలాగే, నాగచైతన్య నటించిన బాలీవుడ్ చిత్రం "లాల్ సింగ్ చద్దా". ఆగస్టు 13వ తేదీన విడుదలకానుంది. ఇందులో అమిర్ ఖాన్, కరీనా కపూర్‌లు ప్రధాన పాత్రలను పోషించారు. నాగ చైతన్య ఇందులో కీలక పాత్రను పోషించారు. 
 
అయితే, ఈ మాజీ దంపతుల చిత్రాలు ఒక్క రోజు వ్యవధిలో రిలీజ్ కానుండటం ఇపుడు సర్వత్రా ఆసక్తిని రేపుతున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏది సక్సెస్ సాధిస్తుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. 

 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు