సెప్టెంబరు 7వ తేదీ భాద్రపద పౌర్ణమి రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం మనకు విశేషంగా శతబిష నక్షత్రంలో కుంభరాశిలో ఏర్పడబోతోంది. ఈ చంద్రగ్రహణం రాత్రి ఆదివారం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై అర్థరాత్రి ఒంటి గంటా 26 నిమిషాల వరకు ఉంటుందని పలువురు పంచాంగ కర్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ గ్రహణ వ్యవధి కాలం 3.30 గంటల పాటు ఉంటుంది. రాత్రి 11.42 గంటలకు గ్రహణ మధ్యస్థ కాలంగా ఉంటుంది.
ఈ చంద్రగ్రహణం ఆసియా ఖండంలో అనేక దేశాల్లో కనిపించనుంది. మన దేశంలో కూడా అనేక ప్రాంతాల్లో కనిపిస్తుందని ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే, సూతకాలం, ఏయే రాశివారు గ్రహణం చూడకూడదనే అంశాలతోపాటు ఏయే రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఎలాంటి నియమాలు ఆచరించాలో ఓ సారి పరిశీలిస్తే,
భారత్, రష్యా, సింగపూర్, చైనాలో కొన్ని ప్రాంతాల్లో చంద్ర గ్రహణం కనిపిస్తుంది. ఈ గ్రహణం వల్ల దేశంలోని ఆలయాలన్నీ ఏడో తేదీ సాయంత్రం 5 గంటల లోపు మూసివేస్తారు. తర్వాతి రోజు ఉదయం సూర్యోదయం తర్వాత ఆలయాల్లో గ్రహణ శుద్ధి కార్యక్రమాలు ఆచరించి తెరుస్తారు. సనాతన ధర్మాన్ని ఆచరించేవారు, గృహస్థ ఆశ్రమ నియమాలు పాటించేవారు సాయంత్రం ఆరు గంటల లోపే భోజనాది నియమాలు పూర్తి చేసుకోవాలి. ఆరు గంటల తర్వాత నుంచి గ్రహణ సమయం కొనసాగేవరకూ ఆహారాన్ని స్వీకరించకుండా ఉండటం మంచిది.
గ్రహణ సమయంలో నిద్ర పోవద్దన్నది శాస్త్రం. చంద్ర గ్రహణం రాత్రి సంభవించడంతో గ్రహణ సమయంలో ధ్యానం, జపం, తపం వంటి కార్యక్రమాలు ఆచరించడం ఉత్తమం. గ్రహణం సమయంలో ముఖ్యమైన నిర్ణయాలు, ప్రయాణాలు, పూజా కార్యక్రమాలకు వీలైనంత దూరంగా ఉంచడం ఉత్తమం.
గ్రహణానికి ముందు పట్టు స్నానం (తల స్నానం), గ్రహణం తర్వాత విడుపు స్నానం ఆచరించాలి. ముఖ్యంగా గర్భిణిలు గ్రహణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గ్రహణ కాల వ్యవధిలో ఇంట్లోనే ఉండేలా చూసుకోండి.
గ్రహణ సమయంలో ఇంట్లో పూజా మందిరం, ఏదైనా నిల్వ ఉండే ఆహార పదార్థాలు (ఊరగాయ) వంటి వాటిపై దర్భలను ఉంచడం శ్రేయస్కరం. ఈ గ్రహణంలో కుంభ, మీనం, మిథునం, సింహ రాశుల వారికి చెడు ఫలితాలు అధికంగా ఉండబోతున్నాయి. మరీ ముఖ్యంగా కుంభ, సింహ రాశుల వారు గ్రహణాన్ని చూడకుండా ఉండటం మంచిది.
గ్రహణం సమయంలో దుర్గా దేవిని పూజించడం, రాహు జపం చేయడం మంచిది. వెండి నాగపడగ, శేరుంబావు బియ్యం, నవ ధాన్యాలు దానం చేయడం.. పట్టు విడుపు స్నానాలు ఆచరించడం వంటివి శుభఫలితాలు ఇస్తాయి. కొన్ని రాశుల వారికి (కుంభం, మీనం, మేషం, సింహం ఉద్యోగ, వ్యాపారాల్లో సమస్యలుండే అవకాశం ఉంది.