ఏకాదశిన మతం మారిన సమంత... నాగచైతన్య పక్కలో కూర్చోబెట్టి పూర్తి చేయించిన పూజారులు

మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (17:21 IST)
టాలీవుడ్ హీరోయిన్ సమంత మతం మారారు. సోమవారం ఏకాదశి రోజున తిథి నక్షత్రాలు చూసుకుని నటి సమంత హిందూమతంలో మారింది. జన్మత క్రిస్టియన్‌ అయిన ఆమె ఇటీవలే నాగార్జున ఇంటిలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైంది. నాగార్జున తన ఫ్యామిలీలో సమంతను కోడలిగా కలుపుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 
 
దీంతో ఆమె హిందూమతంలోకి మారాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా సోమవారం వేదపండితుల మధ్య మతం మార్చుకున్నారు. ఇందుకు  సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోల్లో సమంత పక్కనే నాగ చైతన్య కూడా కూర్చొనివుండటం గమనార్హం. ఏది ఏమైనా.. సమంత, నాగచైతన్య ప్రేమ వ్యవహారం ఎట్టకేలకు పెల్లిపీటలదాకా వచ్చింది. త్వరలో వీరిద్దరు భార్యభర్తలు కాబోతున్నారు. 

వెబ్దునియా పై చదవండి