ఢిల్లీలో జీఆర్ఏపీ-3 ఆంక్షలు అమలు.. ప్రైమరీ స్కూల్స్ మూసివేత

ఠాగూర్

శుక్రవారం, 15 నవంబరు 2024 (09:58 IST)
ఢిల్లీలో జీఆర్ఏపీ-3 ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఢిల్లీ ఎన్.సి.ఆర్‌లో వాయుకాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో స్టేజ్-3 ఆంక్షలు అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ కారణంగా ఐదో తరగతి వరకు అన్ని ప్రాథమిక పాఠశాలలను మూసివేయాల్సిందిగా ఆదేశించింది. ఈ పాఠశాలలకు సంబంధించి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ ఆదేశించారు. ఈ ఆదేశాలు తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు అమలు చేస్తున్నారు. 
 
స్టేజ్-3 ఆంక్షల ప్రకారం అత్యవసరం కాని నిర్మాణాలు, కూల్చివేతలపై నిషేధం ఉంటుంది. ఐదో తరగతి వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తారు. ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకరస్థాయికి పెరుగుతోంది. రెండు రోజులుగా వాయు నాణ్యత సూచీ (ఏక్యూఐ) దాదాపు 400 దాటుతోంది. వాయు కాలుష్యం కట్టడి చర్యల్లో భాగంగా ఢిల్లీ - ఎన్సీఆర్ పరిధిలో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-3ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు