పెళ్ళి ఎక్కడ జరిగినా.. రిసెప్షన్‌ మాత్రం ఇక్కడే.. సమంత క్లారిటీ

సోమవారం, 21 నవంబరు 2016 (14:27 IST)
సమంత, నాగచైతన్యల వివాహం వచ్చే ఏడాదిలో జరగనుంది. ఈ విషయంలో నాగచైతన్య క్లారిటీతో వున్నాడు. అయితే పెళ్లి మాత్రం రోమ్‌లో జరుగుతుందని ఇటీవలే చైతన్య ప్రకటించగా... రిసెప్షన్‌ మాత్రం ఇక్కడే జరుగుతుందని సమంత తెలిపింది. ఇటీవలే హైదరాబాద్‌లో రెస్టారెంట్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె ఈ విషయాన్ని వెల్లడించింది. తాము పెళ్లి ఎక్కడ చేసుకున్నా, రిసెప్షన్‌ మాత్రం ఇదే రెస్టారెంట్‌లో చేసుకుంటామని సమంత ధ్రువీకరించింది.
 
నితిన్‌, నీరజ కోనలు కలిసి సమంత చేతుల మీదుగా ప్రారంభించిన 'టీ గ్రిల్స్‌' రెస్టారెంట్‌. ఇక్కడ ఫుడ్‌ చాలా బాగుందని తమ రిసెప్షన్‌ ఇక్కడే జరుగుతుందని సమంత చెప్పుకొచ్చింది. ఈ రిసెప్షన్‌ వెన్యూ ఫిక్స్‌ అయినా, డేట్‌ మాత్రం ఫిక్స్‌ కాలేదు. 

వెబ్దునియా పై చదవండి