అక్కినేని నాగ చైతన్య - సమంత కలిసి నటించిన ఏ మాయ చేసావే ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరు కలిసి ఆటోనగర్ సూర్య, మనం చిత్రాల్లో నటించారు. ప్రేమలో పడడం.. పెళ్లి చేసుకోవడం తెలిసిందే. అయితే.. పెళ్లి తర్వాత ఎవరికి వారు సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ అయ్యారు. అయితే... పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి సినిమా చేయనున్నారని తెలిసినప్పటి నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీకి నిన్నుకోరి డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వం వహించనున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాను సాహు గరపతి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మించనున్నారు.
లేటెస్ట్ న్యూస్ ఏంటంటే... ఈ సినిమాని ఈ నెల 23న ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాలో రావు రమేష్, శ్రీనివాస్ అవసరాల, పోసాని కృష్ణ మురళి, శత్రు కీలక పాత్రల్లో నటించనున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. చైతన్య, సమంత పెళ్లి తర్వాత నటిస్తోన్న మొదటి చిత్రం, వీరిద్దరు కలిసి నటిస్తోన్న నాలుగవ చిత్రం కావడం విశేషం. వెంకీ మామ సినిమాతో పాటు ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొంటాడట చైతు.