రెండో పెళ్లి అనేది బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్ : సమంత కామెంట్స్

సోమవారం, 18 డిశెంబరు 2023 (15:45 IST)
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌గా గుర్తింపు పొందిన అక్కినేని నాగ చైతన్య - అక్కినేని సమంతల వైవాహికబంధం అనతి కాలంలో ముక్కచెక్కలైంది. తన భర్త, హీరో నాగ చైతన్యకు విడాకులు ఇచ్చిన ఆమె... ప్రస్తుతం సింగిల్‌గా జీవిస్తుంది. అదేసమయంలో ఆమె అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అరుదైన వ్యాధితో బాధపడుతుండటంతో అమెరికాలో చికిత్స చేయించుకుంటుంది. ఈ పరిస్థితుల్లో ఆస్క్ మీ అంటూ సమతం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుంది. ఈ క్రమంలో మీరు మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోకూడదు? అంటూ ఓ అభిమాని ప్రశ్నించగా, సామ్ వెరైటీగా జవాబిచ్చింది. 2023లో విడాకుల వివరాలను కోచ్ చేస్తూ రెండో పెళ్లి అనేది బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటూ చెప్పుకొచ్చింది. 
 
"కీ డివోర్స్ స్టాటిస్టిక్స్" అంటూ సమంత ఓ ఇమేజ్‌తో అభిమానికి జవాబిచ్చింది. అధికారిక గణాంకాల ప్రకారం మొదట పెళ్లి విడాకుల శాతం 50, రెండు, మూడోపెళ్లి చేసుకున్న వారిలో వరుసగా 67 శాతం మంది, 73 శాతం మంది విడిపోతున్నారని తెలిపింది. స్త్రీపురుషులిద్దరి విషయంలోనూ ఇలాగే ఉందని సామ్ చెప్పింది. అందుకే ఆ ఆలోచన బ్యాడ్ ఇన్వెస్ట్‌మెంట్ కిందకి వస్తుందని పేర్కొంది. మరో అభిమాని అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ తనకు దేవుడిపై నమ్మకం ఉందని సామ్ తెలిపింది. మీ రోజువారీ దినచర్యలోనే మీ విజయ రహస్యం దాగివుంటుంది అని కోట్ చేసింది. 
 
విశాఖపట్టణంలో లంకె బిందెలు - గుప్త నిధుల కోసం తవ్వకాలు.. కలకలం  
 
విశాఖపట్టణంలో లంకె బిందెలు, గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. కంచరపాలెం పోలీస్ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది. తాటిచెట్ల పాలెం రైల్వే క్వార్టర్స్‌లో ఇంటి ఆవరణలో పూజలు చేసిన తవ్వినట్టు స్థానికులు గుర్తించారు. రైల్వే ఉద్యోగి కోటేశ్వర రావు ఆధ్వర్యంలో 20 అడుగుల మేరకు గొయ్యి తవ్వకాలు జరిగినట్టు గుర్తించారు. గుప్త నిధుల తవ్వకాల కోసం విజయవాడ నుంచి కొందరు వ్యక్తులు వచ్చినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించారు.
 
ఈ గుప్త నిధుల కోసం తవ్వకాలు గత నెల రోజులుగా సాగించారని, చుట్టూ పరదాలు కప్పి, రాత్రుళ్లు దేవుడు పాటలు పెట్టుకుని కోటేశ్వర రావు చుట్టు పక్కల వాళ్లను ఏమార్చి ఈ తవ్వకాలు జరిపినట్టు సమాచారం. దోష నివారణ కోసం పూజలు చేశామంటూ సదరు వ్యక్తులు చెబుతున్నారు. స్వామీజీ చెప్పినట్టుగా చేశామని కోటేశ్వర రావు పోలీసులకు తెలిపారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నటి విజయశాంతి ప్రశంసలు 
 
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, నటి విజయశాంతి ప్రశంసల వర్షం కురిపించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావమైన తర్వాత శాసనసభ సమావేశాలు తొలిసారి విధానపరంగా జరుగుతున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పరిణామం ఎంతో ఆనందదాయకమన్నారు. 
 
ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత రాష్ట్ర మూడో అసెంబ్లీ సమావేశాలు ఇటీవల ప్రారంభమై సజావుగా సాగుతున్నాయి. దీనిపై విజయశాంతి స్పందిస్తూ, 2014 తర్వాత సమావేశాలు ఇంత సాఫీగా, హుందాగా జరుగుతుండటం ఇదే తొలిసారన్నారు. సచివాలయం కూడా ఇపుడు పూర్తి స్థాయిలో పని చేస్తుందని తెలిపారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణాలో దాదాపు దశాబ్దం తర్వాత ప్రజాస్వామ్య పంథాలో పనిచేస్తుందని పేర్కొన్నారు
 
ఇది ప్రజా ప్రభుత్వమన్నారు. అందువల్ల అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రజాస్వామ్య పంథాలోనే నడుస్తుందని, కోట్లాడి మందికి ఇపుడిపుడే విశ్వాసం ఏర్పడుతుందన్నారు. అంతేకాకుండా 26 యేళ్ల పోరాటం తర్వాత మీ రాములమ్మ ఇపుడు ఏం చేయాలని ఎవరైనా తనను అడిగితే.. తెలంగాణ ప్రజలకు కాలం మేలు చేయాలని, ఈ భూమి బిడ్డల భవిష్యత్ ఎప్పటికీ బాగుండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోలుకుంటానని విజయశాంతి పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు