'బిగ్ బాస్‌'‍ ఛాన్స్ పేరుతో వైద్యుడికి కుచ్చుటోపీ - రూ.10 లక్షలు వసూలు

ఠాగూర్

మంగళవారం, 5 ఆగస్టు 2025 (11:09 IST)
'బిగ్ బాస్' రియాలిటీ షోలో అవకాశం పేరుతో ఓ వైద్యుడుని కొందరు మోసగాళ్లు మోసం చేశారు. అతని నుంచి ఏకంగా రూ.10 లక్షలు వసూలు చేసి, మోసగించారు. మోసపోయిన వైద్యుడు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన చర్మవ్యాధి నిపుణుడు కావడం గమనార్హం. వైద్యుడి ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
భోపాల్‌కు చెందిన అభినిత్ గుప్తా పాయిజన్ స్కిన్ క్లినిక్ నిర్వహిస్తున్నారు. 2022లో కరణ్ సింగ్ అనే వ్యక్తి వైద్యుడుని సంప్రదించాడు. తనను తాను ఈవెంట్ డైరెక్టర్‌గా పరిచయం చేసుకున్నాడు. టీవీ నిర్మాణ సంస్థలతో తనకు బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పాడు. బిగ్ బాస్ షోలో ప్రవేశం కల్పిస్తానని డాక్టర్ గుప్తాకు హామీ ఇచ్చాడు. అతడి మాటలు నమ్మిన డాక్టర్ గుప్తా రూ.10 లక్షలు సమర్పించుకున్నాడు. 
 
బిగ్ బాస్‌లో పాల్గొనే కంటెస్టంట్ల జాబితా విడుదల కాగా, అందులో తన పేరు లేకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన  వైద్యుడు... కరణ్ సింగ్‌ను నిలదీశాడు. బ్యాక్ డోర్ పద్దతి ద్వారా అవకాశం వస్తుందని చెప్పి కరణ్ ఆ సమయానికి తప్పించుకున్నాడు. కానీ, రోజులు గడిచినా ఎలాంటి స్పందన లేకపోవడంతో డాక్టర్ గుప్తా తన డబ్బులు తిరిగి ఇవ్వమని డిమాండ్ చేశాడు. ఆ తర్వాత నుంచి డాక్టర్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశాడు. దీంతో డాక్టర్ గుప్తా పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు