చిత్ర పరిశ్రమలో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ అప్పట్లో ఓ హీరో తనను చాలా ఇబ్బంది పెట్టాడని, అదీ వేధింపు అని చెప్పలేను గానీ, ఆ రిలేషన్ వల్ల నరకం చూశానని, కొన్ని అనివార్య కారణాల వల్ల అతగాడితో స్నేహం చేయాల్సివచ్చిందని గతాన్ని గుర్తు చేసుకుంది. ఆ సమయంలోనే నాగ చైతన్య తాను ఇంకా దగ్గరయ్యామని, నన్ను మళ్ళీ బలవంతురాలిగా మార్చింది చైతూనే అనే చెప్పుకొచ్చింది.
అయితే, సమంతను అంతలా టార్చర్ పెట్టిన హీరో ఎవరు అంటే సిద్ధార్థ్ పేరు వినిపిస్తుంది. అది నమ్మేలా లేదని ఫిల్మ్ నగర్‌లో అపుడే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. సిద్ధూతో లవ్‌లో ఉన్నపుడు బయటికి చాలా హ్యాపీగా ఉండేది. వారిద్దరూ పబ్లిక్‌గానే కనిపించేవారు. ఆ సమయంలో సిద్ధూ కంటే సమంతనే చాలా హుషారుగా ఉండేదన్నది ఈ కామెంట్స్. అలాంటి సిద్ధూ.. సమంతను ఇబ్బంది పెట్టడం ఏంటన్నది ఇపుడు చర్చనీయాంశంగా మారింది.