Air India: ఎయిర్ ఇండియాలో ఏసీ లేదు.. నరకం చూసిన ప్రయాణీకులు (video)

సెల్వి

సోమవారం, 19 మే 2025 (19:27 IST)
Air India
ఎయిర్ ఇండియా విమానంలో ఎక్కిన ప్రయాణీకులు నరకం ఎలా వుంటుందో చూశారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రయాణిస్తున్న సమయంలో ఏసీ ఫెయిల్యూర్ ఏర్పడింది. దీంతో ప్రయాణీకులు ఉక్కపోతతో చుక్కలు చూశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఢిల్లీ నుంచి భువనేశ్వర్‌కు ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. గురుగ్రామ్‌కు చెందిన ఓ ప్రయాణీకుడు శ్వాస సరిగ్గా ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. విమానంలో ఏసీ ఫెయిల్యూర్ కారణంగా ప్రయాణీకులు గాలి లేకుండా నరకం అనుభవించారు.
 
ఎండ తీవ్రతకు తోడు ఏసీ పనిచేయకపోవడంతో ప్రయాణీకులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎయిర్ ఇండియా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అస్వస్థతకు గురైన తుషార్ కాంత్ అనే ప్రయాణీకుడు సూచించాడు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యం పట్ల క్షమాపణలు కోరింది. 

ఎయిర్ ఇండియాలో ఉక్కపోత.

ఢిల్లీ నుంచి పట్నా వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో గాలి లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.

ఇలాంటివి ఎయిర్ ఇండియాలో తరచూ జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ప్రయాణికులు విజ్ఞప్తి చేశారు. #AirIndia pic.twitter.com/SMlStXUAMw

— greatandhra (@greatandhranews) May 19, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు