సమంత అక్కినేని చేసే సినిమాలు భిన్నమైనవిగా ఎంచుకుంటోంది. రొటీన్ తరహా పాత్రలు చాలా చేసేశాను అంటూ ఏదైనా ఇంట్రెస్ట్ కలిగే కథ, పాత్ర వుంటే చాలు చేసేస్తానంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చింది. ది ఫ్యామిలీ మేన్2లో ఆమె చేసిన రాజీ పాత్ర గురించి తెలిసిందే. `ఓబేబీ` సినిమా తర్వాత అలాంటి భిన్నమైన పాత్రను చేయడంలో స్పీడ్ పెంచింది. తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` సినిమా చేస్తోంది. అది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోంది. ఇప్పటికే యాభైశాతం చిత్రీకరణ పూర్తయింది.