ఫ్యామిలీ మ్యాన్ సీజన్ రివ్యూ.. ది ఫ్యామిలీ మ్యాన్ 3 కూడా వుంది.. కరోనా వ్యాప్తే స్టోరీ!

శుక్రవారం, 4 జూన్ 2021 (22:15 IST)
The Family Man Season 2
అక్కినేని సమంత తొలిసారి నటించిన వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్ 2'. ఈ సిరీస్ కోసం దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొదటి సీజన్ ప్రేక్షకులను బాగా అలరిచిడంతో... రెండో సీజన్‌ పై అంచనాలు భారీగా పెరిగాయి. అత్యంత భారీగా రాజ్ అండ్ డీకే తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్‌ 2 సీజన్ రివ్యూ ఎలా వుందో ఓసారి చూద్దాం. 
 
తొలి సీజన్ ఢిల్లీలోని గ్యాస్ లీక్ ఘటనతో ముగుస్తుంది. ఇక రెండో సీజన్ ముఖ్యంగా శ్రీలంక తమిళులపై ఫోకస్ చేశారు. ఎల్టీఈ ఛాయలు కనిపిస్తుడడంతో పాటు ఇండియా, శ్రీలంక, లండన్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. శ్రీలంకలో తమిళ నాయకుడు భాస్కరణ్ దళాన్ని అంతం చేసేందుకు ఇండియా సాయం చేస్తుంది. కానీ, ఇంతలో భాస్కరణ్ అక్కడినుంచి తప్పించుకుంటాడు. 
 
ఈ నేపథ్యంలో అతని తమ్ముడు (సుబ్బు)ని అప్పగించాలని, లేదంటే చైనాతో వ్యాపార ఒప్పందం చేసుకుంటామని ఇండియాకు శ్రీలంక(అధ్యక్షుడు రూపతంగ) వార్నింగులు ఇస్తుంటాడు. ఈ క్రమంలో సుబ్బును పట్టించేందుకు భారత్ అంగీకరిస్తుంది.
 
కానీ, సుబ్బును కోర్టులో ప్రవేశ పెట్టే సమయంలో పాకిస్తాన్ మేజర్ సలీం ప్లాన్‌లో భాగంగా బాంబ్ బ్లాస్ట్‌లో మరణిస్తాడు. దీంతో ఇండియాపై పగను పెంచుకున్న భాస్కరణ్, పాకిస్తాన్ మేజర్ సమీర్‌తో కలిసి.. భారత ప్రధానిపై దాడి చేసేందుకు ప్లాన్ చేస్తాడు. 
 
కట్ చేస్తే.. శ్రీకాంత్ తన సీక్రెట్ ఏజెంట్ టాస్క్ ఉద్యోగాన్ని వదిలి ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో జాయిన్ అవుతాడు. భార్య సుచిత్ర (ప్రియమణికి) ఇష్టమైనట్టు ఉండేందుకు, జాబ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరో వైపు ఇంట్లో సమస్యలతో ఇబ్బందులు పడుతుంటాడు. 
 
భార్య సుచిత్రతో ఎప్పుడూ గొడవపడుతూ ఉంటారు. శ్రీకాంత్ కూతురు రోజంతా ఫోన్‌తోనే గడిపేస్తుంటుంది. అలాగు కొడుకు ఏదో ఒక కోతి చేష్టలతో విసిగిస్తుంటాడు. ఇలా సాగిపోతున్న శ్రీకాంత్ లైఫ్‌లో.. ప్రధానిపై దాడికి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో సాప్ట‌వేర్ జాబ్‌ వదిలి మళ్లీ టీంలో జాయిన్ అవుతాడు. 
Family Man2
 
రెండో ఎపిసోడ్‌లో అంతా ఎదురు చూస్తున్న అక్కినేని సమంత ఎంట్రీ ఇస్తుంది. మొదట్లో అమాయకంగా చిత్రీకరించిన పాత్రలో రాజేశ్వరి (రాజి) (‏సమంతా) కనిపిస్తుంది. రాజీ స్పిన్నింగ్ మిల్‌లో పని చేస్తుంటుంది. పనిచేసే చోట యజమాని వేధింపులు, బస్సులో ఆకతాయిల టీజింగ్‌లను ఎంతో ఓపికతో భరిస్తుంటుంది. ఈ క్రమంలో ఓ రోజు ఓ ఆకతాయిని దారుణంగా హతమారుస్తుంది. 
 
ఇదే సమయంలో రాజీకి తమ నాయకుడి దగ్గరి నుంచి పిలుపు వస్తుంది. ఇక అక్కడి నుంచి రాజీ పాత్ర ఎలా తీర్చిదిద్దారో చెప్పనక్కర్లేదు. ఈ లోపు ఫ్యాక్టరీ యజమానిని కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తుంది. ఈ హత్య కేసులో రాజీ కోసం పోలీసులు గాలిస్తుంటారు. మరో వైపు మనోజ్ భాజ్ రాజీని కలిసేందుకు వెళ్తారు. మరి రాజీ పోలీసులకు దొరుకుతుందా? అసలు మేజర్ సమీర్, భాస్కరణ్ ప్లాన్ అమలు చేస్తారా? అనే ఆసక్తికర అంశాలతో మిగతా ఎపిసోడ్లను తీర్చిదిద్దారు.
 
విశ్లేషణ
మనోజ్ భాజ్ పెయీ, సమంత, ప్రియమణిలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అక్కినేని సమంత మాత్రం తనలోని టాలెంట్ మాయ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లో ఇరగదీసింది. డీ గ్లామర్ రోల్ అయినా తన సత్తా చూపించి, వీక్షకులను తనవైపు తిప్పుకునేలా చేస్తుంది. శ్రీలంక ఆర్మీ చేతిలో అన్యాయానికి గురైన తమిళుల ప్రతినిధిగా సమంతా జీవించారు. అయితే, సమంత పాత్రపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని సిరీస్ చూస్తే తెలిసిపోతుంది. 
 
తమిళనాడు, తమిళ ప్రజలకు వ్యతిరేకంగా ఆమె నటించలేదు. అంచనాలకు తగినట్లుగానే మేకర్స్ రాజ్ అండ్ డీకే సీజన్ 2 తెరకెక్కించారు. కథనాన్ని వేగంగా తీర్చిదిద్ది ఆకట్టుకున్నారు. ఒక్కో చిక్కు ముడిని ఎపిసోడ్ చివర్లో విప్పేస్తుంటారు. మొదటి రెండు ఎపిసోడ్లు కాస్త బోర్ కొట్టించినా..మిగతా ఏడు ఎపిసోడ్లు ఆకట్టుకుంటాయి. మొదటి సీజన్‌కు ఏ మాత్రం తీసిసోకుండా సాగుతుంది. ఇండియాలో తెరకెక్కించిన ది బెస్ట్ సిరీస్‌లలో ఫ్యామిలీ మెన్ కూడా ఉంటుందనడంలో సందేహం లేదు.
 
ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2 సీజన్ ముగిసిన తర్వాత మూడో సీజన్ కూడా ఉందనే విషయం కొసమెరుపుగా మారింది. కోల్‌కతాను కేంద్రంగా చేసుకొని చైనా దేశీయులు కరోనావైరస్ వ్యాప్తి చేయడం అనేది మూడో సీజన్‌కు ముడిసరుకుగా మారింది. ఆసక్తికరమైన రీతిలో ముగింపు ఇచ్చి మూడో సీజన్ కోసం ఎదురు చూసేలా చేశారు దర్శక, నిర్మాతలు రాజ్ అండ్ డీకే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు