సంపూర్ణేష్ బాబు 'బ‌జార్ రౌడి' టీజర్ వ‌చ్చేసింది

గురువారం, 25 మార్చి 2021 (17:55 IST)
Bazaar Rowdy, teaser
'హృద‌య‌ కాలేయం', 'కొబ్బ‌రిమ‌ట్ట' లాంటి విచిత్ర‌మైన టైటిల్స్ లో విభిన్న‌మైన సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు న‌టిస్తున్న చిత్రం 'బ‌జార్ రౌడి'. ఈ సినిమా టీజర్ విడుదల కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ తో పాటు  సీనియర్ నటుడు మైత్రి మూవీ మేకర్స్ నవీన్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, నటుడు పృథ్వి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 
 
మైత్రి నిర్మాత నవీన్ యర్నేని మాట్లాడుతూ "టీజర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సంపూర్నేష్ నటించిన ప్రీవియస్ ఫిలిమ్స్ 'హృదయ కాలేయం','కొబ్బరి మట్ట' లాగే ఇది కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా" అన్నారు. 
'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ  " సంపూర్నేష్ బాబు గారికి టీం అందరికీ ఆల్ ది బెస్ట్.  దేవుడి మనుషుల్ని పుట్టిస్తాడు. అలా రాజమౌళి గారు ఒక ట్వీట్ తో సంపూ గారిని పుట్టించారు.మనందరికీ చూపించారు.
 
సంపూర్నేష్ బాబు మాట్లాడుతూ " ఒక చిన్న నటుడ్ని ఆదరించిన ప్రేక్షకులు ఈ 'బజార్ రౌడి' ని కూడా తప్పకుండా ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా. నా నుండి ప్రేక్షకులు ఏమైతే ఆశిస్తారో వాటికి మించి కంటెంట్ ఈ సినిమాలో ఉంది. మా నిర్మాత గారు ఇందులో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులను తీసుకొని వారితో నటించే అవకాశం నాకు కల్పించారు. ప్రతీ ఒక్కరూ వారి వర్క్ లో బెస్ట్ ఇచ్చారు. త్వరలోనే ఈ సినిమాతో మీ ముందుకొస్తున్నా." అన్నారు.
హీరోయిన్ మహేశ్వరీ మాట్లాడుతూ " షూట్ చాలా ఎంటర్టైనింగ్ గా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా వాచ్ చేయండి"అన్నారు.
 
Maheswari, Sampoo
అద్దంకి ఎం.ఎల్.ఎ. గొట్టిపాటి రవి కుమార్మా ట్లాడుతూ " నిర్మాత శ్రీనివాస్ గారు మా నియోజికవర్గం నుండి వచ్చి సినిమా నిర్మించడం సంతోషంగా ఉంది. రాజకీయ పరంగానూ ఆయనకీ మంచి పేరుంది. అలాగే నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో కూడా మంచి పేరు రావాలని, మరిన్ని సినిమాలు ఆయన నిర్మించాలని కోరుకుంటున్నా. సినిమా మంచి విజయం సాధించి అందరికీ గుర్తింపు రావాలని ఆశిస్తున్నా"అన్నారు.
 
నిర్మాత సందిరెడ్డి శ్రీనివాసరాజు మాట్లాడుతూ "ప్రతీ ఒక్కరూ సహకారం అందిస్తూ సక్సెస్ ఫుల్ గా ఫినిష్ చేశారు. సినిమా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఎడిటింగ్ లో ఎడిటర్ గౌతంరాజు గారి సలహాలు , సూచనలు తీసుకుంటున్నాం. ఈ బజార్ రౌడి ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా"అన్నారు.
 
దర్శకుడు వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ " బర్నింగ్ స్టార్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు. మంచి కంటెంట్ తో ఆధ్యాంతం ఎంటర్టైన్ చేసేల ఉంటుంది."అన్నారు.
 
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పృథ్వి, సమీర్, మహేష్ కత్తి మాట్లాడుతూ... సినిమా తప్పకుండా సంపూర్ణేష్ బాబుకు మరో మంచి సినిమా అవుతుంది. త్వరలో రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది అన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు