సంపూర్ణేష్ బాబు కొబ్బ‌రి మ‌ట్ట సినిమాని రిలీజ్ చేస్తుంది ఎవ‌రు..?

శనివారం, 27 జులై 2019 (21:37 IST)
హృద‌య‌కాలేయం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో, కాలేయంలో త‌న స్థానాన్ని టెంట్ వేసుకుని ప‌డుకున్న బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యంలో హృద‌య‌కాలేయం సృష్టిక‌ర్త స్టీవెన్ శంక‌ర్ అందించిన క‌థ‌, క‌థ‌నం, మాట‌లతో కొబ్బ‌రిమ‌ట్ట అనే చిత్రాన్ని తీయాల‌న్న ఆలోచ‌న‌తో ముందుకు వ‌చ్చాడు రూప‌క్ రొనాల్డ్ స‌న్‌.

అతడిని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ.. సున్నిత‌మైన క‌థ‌ల‌తో చిత్రాలు నిర్మించి ప్రేక్ష‌కులకి గిల్లిక‌జ్జాలు పెట్టే సాయి రాజేష్ నిర్మాత‌గా దాదాపు 3 సంవ‌త్స‌రాల‌కు పైగా అత్యాధునికమైన సాంకేతిక నిపుణుల‌తో నిపుణుల పర్య‌వేక్ష‌ణ‌లో భారీ వ్యయం తో ఎక్కాడా కాంప్ర‌మైజ్ కాకుండా ఎండ‌న‌కా, వాన‌న‌కా, చ‌లిని సైతం త‌ట్టుకుని ప్రేక్ష‌కుడికి వినోదాన్ని అందించాల‌నే నిరంత‌ర కృషితో క‌సితో చేసిన చిత్రం కొబ్బ‌రి మ‌ట్ట‌. 
 
ఈ చిత్రంలో బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు మూడు పాత్ర‌లు వేయ‌ట‌మే కాకుండా అత్యంత భారీ డైలాగ్‌లు చెప్పి లిమ్కా బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డుని నెల‌కొల్పాడు. ఈ చిత్రంలో పాపారాయుడు, పెద‌రాయుడు, ఆండ్రాయుడు లాంటి అత్య‌ద్భుత‌మైన పాత్ర‌లు చేసి మెప్పించ‌బోతున్నారు. ఈ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రంలో తెలుగు సినిమాలో వున్న న‌టీన‌టులంద‌రూ న‌టించారు. ఈ సినిమాకి సంబందించి ఇటీవ‌ల విడుద‌ల చేసిన అఆ.. ఇఈ అనే సాంగ్ యూట్యూబ్‌లో రెండు మిలియ‌న్స్ వ్యూస్ 24 గంట‌ల్లో రావ‌టం ఈ చిత్రంపై సినిమా ల‌వ‌ర్స్‌కి వున్న క్రేజ్‌ని తెలియ‌జేస్తుంది. 
 
ఈ భారీ చిత్రాన్ని ఆగ‌ష్టు 10న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌టానికి నిర్మాత భారీ ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్‌టైన్ చేయ‌టంలో ఎక్క‌డా బారీయ‌ర్స్ లేని ఇంత‌టి క్రేజి చిత్రాన్ని నైజాం, ఓవ‌ర్‌సీస్ హ‌క్కుల‌ని నొ బారియ‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ వారు సొంతం చేసుకున్నారు. 120 నిమిషాల ఈ చిత్రంలో యాక్ష‌న్‌, కామెడి, సెంటిమెంట్‌, రొమాన్స్‌, సందేశం, ఎమోష‌న్‌, ల‌వ్ లాంటి అన్ని జోనర్స్ క‌ల‌యికే ఈ కొబ్బ‌రిమ‌ట్ట‌.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు