సంతోషం మ్యాగజైన్ మొదలెట్టినప్పుడు నాకు ఇంకా చిన్న వయసు నాగార్జున గారు చిరంజీవి గారు బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు లాంటి అగ్ర నటీనటులందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో అవార్డ్స్ మొదలుపెట్టాను టాలీవుడ్ కింగ్ నాగార్జున గారు సంతోషం సురేష్ కొండేటి కూడా ఫిలింఫేర్ స్థాయిలో అవార్డ్స్ నిర్వహించగలడు ఆయన నా పై ఉంచిన నమ్మకాన్ని నేను నిలబెట్టుకోవాలనుకున్నాను
అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు లాంటి అగ్ర హీరోలు సురేష్ కొండేటి చేయగలడు అని నా పై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇన్నాళ్లు వరకు సంతోషం ఫిలిం అవార్డ్స్ ఎక్కడ ఆగకుండా నిర్వహించాను నిర్వహిస్తున్నాను అని అన్నారు. గోవా గవర్నమెంట్ వాళ్ళు సహకారం మర్చిపోలేనిది. అలాగే ఆ గవర్నమెంట్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు.