'ప్రేమ కథా చిత్రం'తో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన సప్తగిరి.. మారుతి ఊరువాడవడంతో.. ఆర్టిస్టుగా మంచి అవకాశాలు సంపాదించుకున్నాడు. హస్యనటుడిగా పీక్‌స్టేజ్‌లో ఉండగానే.. హీరోగా మారిపోయాడు. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌గా తన పేరుతోనే హీరో అయిన ఈ కమెడియన్ మరోసారి హీరోగా కన్పించబోతున్నాడు. ఈసారి 'రివాల్వర్ రాజు'గా దూసుకుపోవాలని చూస్తున్నాడు.
ఇంతకుముందు ఇచ్చిన సినిమా అనుభవంతో ఇందులో కాస్త కామెడీతోపాటు సెంటిమెంట్‌ను కూడా పండించాలనే కథలో కొన్ని మార్పులు చేసినట్లు తెలుస్తోంది. సీనియర్ రైటర్ అబ్బూరి రవి సహకారంతో కథలో మార్పులు చేసి త్వరలో సెట్‌పైకి ఎక్కనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రానికి నిర్మాత, దర్శకులు ఎవరనేది త్వరలో వెల్లడిస్తానని తెలియజేస్తున్నాడు.