నాకు స్మోకింగ్ అలవాటుంది.. సుశాంత్‌ డ్రగ్స్ తీసుకుంటాడు.. సారా అలీ ఖాన్

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (10:54 IST)
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసుకు ఇప్పట్లో తెరపడేలాలేదు. సుశాంత్ కేసు విచారణలో డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ సంస్థ ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలో ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా పని చేసిన క్షితిజ్‌ రవి ప్రసాద్‌కు ముంబై కోర్టు వచ్చే నెల 3 వరకూ రిమాండ్‌ విధించింది.
 
ఈ నేపథ్యంలో నటి సారా అలీ ఖాన్‌ నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా సుశాంత్‌తో కొంతకాలం ప్రేమలో ఉన్న మాట వాస్తవమేనని, థాయ్‌లాండ్‌కు పర్యటనలో ఆయనతో కలిసి వెళ్లానని ఆమె వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. 
 
అయితే.. తాను సిగరెట్స్‌ తాగేదాన్ని తప్పితే డ్రగ్స్‌ ఎప్పుడూ తీసుకోలేదని సారా వెల్లడించినట్లు ఎన్సీబీ వర్గాలు వెల్లడించాయి. ఈ విచారణలో సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడని ఆమె తెలిపింది. సారాతో పాటు దీపిక పదుకొణే, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఫ్యాషన్‌ డిజైనర్‌ సిమోనీ ఖంబట్టా, దీపిక మేనేజర్‌ కరిష్మా ప్రకాశ్‌లను ఎన్‌సీబీ శనివారం ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు