ఇటీవలే కొందరు సినీహీరోలు కోవిడ్ పేషెంట్ల కోసం ఆక్సిజన్ ఇతరత్రా సౌకర్యాలు కల్పించడానికి తమ వంతు సాయంగా స్వచ్చంధ సంస్థలతో కలిసి సేవ చేస్తున్నారు. నిన్ననే రానా కూడా ఫలానా సంస్థకు సాయం చేయండి అంటూ స్టేట్ మెంట్ ఇచ్చాడు. అయితే ఇలాంటి వాటిని దుర్వినియోగం చేస్తూ ఓ టీమ్ బయలుదేరింది. అదే సాయిధరమ్ తేజ్.
"ఓ వ్యక్తి నాలా మారి, నాకు తెలిసిన కొంతమందితో టచ్ లోకి వెళ్తున్నాడు.. నాతో కలిసి నటించిన వాళ్లకు, ఇండస్ట్రీలో ఇతరులకు ఫోన్లు చేసి ఆర్థిక సాయం అడుగుతున్నాడు. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యలకు సిద్ధమౌతున్నాను. నా పేరు చెప్పి డబ్బులు అడుగుతున్న అలాంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండండి` అంటూ క్లారిటీ ఇచ్చాడు.
ఇదిలా వుండగా, సాయితేజ్‌కు ఉదారగుణం వుంది. గతంలో పలువురికి సాయం చేసిన దాఖలాలు వున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని ఆయన గురించి బాగా తెలిసినవారే ఇలాంటి చర్యకు పాల్పడినట్లు ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.