దేశంలో సంచలనం సృష్టించిన కేసుల్లో గోల్డ్ స్కామ్ ఒకటి. కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ స్కామ్‌లో తొలుత సీఎం కార్యాలయానికి సంబంధం ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే, అవన్ని నిరాధారమైన ఆరోపణలన్నీ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇదిలావుంటే, ఈ స్కామ్‌లో మంజేశ్వర్ ఎమ్మెల్యే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) నేత ఎంసీ కమరుద్దీన్‌ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
కేసు విచారణ సందర్భంగా మొత్తం 77 మంది ఫిర్యాదుదారుల రూ.33 కోట్ల మోసానికి సంబంధించి అధికారులు ప్రశ్నించారు. అయితే, తొలి మూడు కేసుల్లోనే ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. కాగా, ఆయన రూ.15 కోట్ల మోసానికి పాల్పడినట్టు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని ఏఎస్పీ తెలిపారు.