ఆ పాప పడే వేదనను ఊహించలేకపోతున్నా.. శేఖర్ కమ్ముల

శనివారం, 22 అక్టోబరు 2022 (11:22 IST)
హైదరాబాదులో నాలుగేళ్ల చిన్నారిపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడిన ఘటనపై ప్రముఖ టాలీవుడ్‌ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఆవేదన వ్యక్తం చేశారు. ఆధునిక సమాజంలో మరోసారి ఇటువంటివి జరగకుండా ఉండాలని కోరుకుంటూ సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్‌ చేశారు. 
 
డీఏవీలో చదివే నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటం ఘోరం అన్నారు. నిస్సహాయతతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ పాప పడే వేదనను ఊహించలేకపోతున్నానని శేఖర్ కమ్ముల తెలిపారు. ధైర్య సాహసలతో న్యాయం కోసం పోరాటం చేస్తున్న ఆ బాలిక తల్లిదండ్రులకు జోహార్లంటూ పోస్టు పెట్టారు. 
 
పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదని శేఖర్ కమ్ముల తెలిపారు. ఆధునిక సమాజంలో ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకూడదన్నారు. మన పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని రూపొందించినవారవుతామని అని శేఖర్ కమ్ముల ఈ పోస్టులో తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు