శంభో శంకర సినిమాతో హీరో అయిన శకలక శంకర్‌కు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు. గత కొన్నిరోజులుగా సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న శకలక శంకర్ పవన్ కళ్యాణ్‌ను పొగుడుతూ, కొంతమంది తారలను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్న విషయం తెలిసిందే. పవన్‌కు వీరాభిమాని శకలక శంకర్. మొదట్లో కమెడియన్‌గా జబర్దస్త్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన శంకర్ ఆ తరువాత సినిమాల్లో కామెడీ స్కిట్లో చేసుకుంటూ ముందుకెళ్ళాడు. ఇప్పుడు ఏకంగా హీరో అయిపోయాడు.
అయితే శంకర్ హీరోగా అవడం సాటి కమెడియన్లకు ఇష్టమేగానీ ఆయన గత కొన్నిరోజులుగా కాంట్రవర్సీకి కేరాఫ్‌గా మారుతుండటం చర్చకు దారితీస్తోంది. తాజాగా షకలక శంకర్ వైసిపి ఎమ్మెల్యే, సినీ నటి రోజాను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. రోజా జనసేన పార్టీలోకి వచ్చేయాలి. ఆమెకు ఇది మంచి ఛాన్సు. మళ్ళీ ఆమెకు అలాంటి అవకాశం రాదు.
ఒకవేళ రోజా జనసేనలో చేరకుంటే ఆమెను నేరుగా కలవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. పవన్ కళ్యాణ్ వెంట నడవడానికి రోజానే కాదు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, నాగబాబు అందరూ రావాలంటూ వ్యాఖ్యలు చేశారు. శకలక శంకర్ వ్యాఖ్యలు కాస్త తీవ్ర దుమారానికి దారితీస్తోంది. ఐతే శకలక శంకర్‌ను హీరోగా కాకుండా పవన్ అభిమానిగా చూస్తే ప్రాబ్లెం లేదు కదా.