షకలక శంకర్ జబర్ధస్త్ ద్వారా బాగా పాపులర్ అయి ఆ తర్వాత వెండితెరకు వచ్చి తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. కమెడియన్‌గా ఫుల్ బిజీగా ఉన్న షకలక శంకర్ సడన్‌గా హీరోగా సినిమా చేసాడు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే... హీరో అవ్వాలని ఎందుకు అనిపించిందో ఏమో కానీ.. తన స్నేహితుడు కథ రెడీ చేస్తే ఆ కథ పట్టుకుని డైరెక్ట్‌గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరకి వెళ్లి 2 కోట్లు పెట్టుబడి పెట్టండి. ఓ పది కోట్లు వస్తాయన్నాడట.
ఇది స్వయంగా షకలక శంకరే చెప్పాడు. త్రివిక్రమ్‌కి ఏం చెప్పాలో అర్థం కాలేనట్టుంది. ఇప్పుడుకాదు తర్వాత చేద్దాం అని ఆల్ ది బెస్ట్ చెప్పాడట. ఆ తర్వాత దిల్ రాజు దగ్గరకి వెళ్లాడట. అక్కడ కూడా సేమ్ డైలాగే. ఇలా కొంతమందిని కలిసిన తర్వాత ఆఖరికి ఎలాగోలా అనుకున్నది సాధించాడు. హీరోగా నటించాడు. అంతా బాగానే ఉంది కానీ... తన మీద రెండు కోట్లు పెట్టుబడి పెట్టమంటే అంత ఈజీగా ఓకే అంటారా..? దీనికి చాలా లెక్కలు ఉంటాయి కదా.