స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ తాజాగా ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. దానికి మూలం ఓ కొరియన్ మూవీ మిడ్ నైట్ రన్నర్స్. టైటిల్ ను బట్టే అర్థమయివుంటుంది గదా. అర్థరాత్రి జరిగే ఓ సంఘటన ఆధారంగా దీన్ని తెలుగు నేటివిటీకి అనువదించారు. ఇందులో రెజీనా, నివేదా థామస్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సైలెంట్‌గా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఫిలింఛాంబర్‌లో శాకినీ- ఢాకినీ అనే టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సునీత తాటి, డి. సురేష్ బాబు నిర్మిస్తున్నారు.