కొత్త పాత్రల్ని వదులుకోను... విలన్ పాత్రలకు సై... : రెజీనా కాసాండ్రా

మంగళవారం, 23 ఫిబ్రవరి 2021 (19:16 IST)
కొత్త పాత్రలు వస్తే ఆ అవకాశాన్ని వదులుకోనని సినీ నటి రెజీనా చెప్పుకొచ్చింది. ఒక నటిగా తననుతాను నిరూపించుకునేందుకు ప్రతినాయక పాత్రలను సైతం చేసేందుకు సిద్ధమని తెలిపింది. 
 
హీరో విశాల్‌ నటించిన తాజా చిత్రం ‘చక్ర’. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఈ చిత్రంలో విలన్‌ పాత్రలో హీరోయిన్‌ రెజీనా నటించగా, ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. 
 
ఒక నటిగా ఇలాంటి పాత్రలకు తాను కూడా సరిపోతానని భావించడం వల్లే ఈ అవకాశం వచ్చిందని చెప్పింది. ఖచ్చితంగా ఒక నటిగా తనను తాను మెరుగుపరుచుకునేందుకు ఇలాంటి పాత్రలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపింది
 
‘చక్ర’లాంటి చిత్రంలో ప్రతినాయక పాత్రలో నటించే చాన్సు రావడం అనేది చాలా చాలా అరుదని తెలిపింది. అయితే, తన పాత్రకు డైలాగులు పెద్దగా లేవనే కామెంట్స్‌పై ఆమె స్పందిస్తూ, ఈ పాత్రకు డైలాగులు తక్కువగా రాశారని, కళ్ళతోనే హావభావాలు పలికించేలా దర్శకుడు తన పాత్రను రూపకల్పన చేశారని చెప్పింది. 
 
విలన్‌ పాత్రలు చేయడం వల్ల భవిష్యత్తులో కూడా ఇలాంటి పాత్రలే వస్తాయి కదా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, అలా ఎందుకు అనుకోవాలి... ఇలాంటి పాత్రలతో పాటు ఇతర పాత్రలు వచ్చినా ఒక నటిగా తమను తాము నిరూపించుకునేందుకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు