జూన్ 3న జైపూర్‌లో పెళ్లి.. హాల్దీ వేడుకలో సందడి చేసిన శర్వానంద్

శుక్రవారం, 2 జూన్ 2023 (19:49 IST)
Sharvanand
టాలీవుడ్ నటుడు శర్వానంద్, అతని కాబోయే భార్య రక్షిత రెడ్డి జూన్ 3న జైపూర్‌లో తమ కుటుంబ సభ్యులు, సన్నిహిత సమక్షంలో వివాహం జరుగనుంది. తాజాగా హల్దీ వేడుకలో శర్వానంద్  సంబరాలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలో, శర్వానంద్ పసుపు రంగులను చల్లుకుంటుూ హ్యాపీగా సందడి చేశాడు. 
 
హల్దీ వేడుక నుండి ఆకర్షణీయమైన ఫోటోలు నెట్టింట పోస్టు చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెల్లటి కుర్తా పైజామాలో అలంకరించుకున్న శర్వానంద్ హల్దీలో పూర్తిగా తడిసి ముద్దయ్యాడు. జైపూర్‌లోని ప్రఖ్యాత లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా రాయల్ వెడ్డింగ్ జరగనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు