శింబు నటిస్తున్న వెందు తనిందదు కాడు సినిమా వల్ల ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (పెఫ్సీ), తమిళనాడు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ (టి.ఎఫ్.సి.సి.) మధ్య చర్చలు తీవ్రంగా సాగుతున్నాయి. శింబు గతంలో నలుగురు నిర్మాతలతో చేసుకున్న ఒప్పందాన్ని అతిక్రమించి ఈ కొత్త సినిమాకు డేట్స్ కేటాయించాడు. ఇది తెలిసిన నిర్మాతలు తమమండలికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రధానంగా శింబుతోట్రిపుల్ ఎ మూవీ నిర్మించిన మైఖేల్ రాయప్పన్ తనకు ఆ సినిమా ద్వారా వచ్చిన నష్టాలను పూడ్చకుండా శింబు కొత్త సినిమాలో నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు.
ఇక ఈ విషయాన్ని పరిశృలించిన నిర్మాతల మండలి శింబు సినిమాలకు సహకరించవద్దంటూ పెఫ్సీకి లేఖ రాసింది. అయితే కరోనా సమయంలో పెఫ్సీ సభ్యులకు శింబుతో ప్రస్తుతం చేస్తున్న చిత్ర నిర్మాత ఇషారీ కె గణేశ్ ఎంతో సాయం చేశాడు.ప్రస్తుతం రోజా భర్త సెల్వమణి పెఫ్సీకి అధ్యక్షుడిగా ఉన్నారు. శింబు తన నిర్మాతల కష్టాలను పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. మరి ఫైనల్‌గా శింబు ఏం చెబుతాడో రేపు తెలుస్తుందని సెల్వమణి అంటున్నారు.