తెలుగు బిగ్ బాస్ షో విజేత శివ బాలాజీ సతీమణి మధుమితకు వేధింపులు ఎదురయ్యాయి. పలు సినిమాలు, సీరియల్స్‌లో నటించిన శివబాలాజీ భార్య మధుమితకు కూడా వేధింపులు తప్పలేదు. ఈ మేరకు శివబాలాజీ పోలీసుల్ని ఆశ్రయించాడు. తన భార్యను వేధిస్తున్నట్టు ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజుల పాటు మధుమితకు గుర్తు తెలియని వ్యక్తుల మొబైల్స్ నుంచి అసభ్యకరమైన మెసేజ్‌లు, పోస్టులు వస్తున్నాయి. ఆరంభంలో వాటిని ఆమె పట్టించుకోకుండా డిలీట్ చేశారు. తర్వాత రోజురోజుకు ఇలాంటి టెక్ట్స్ మెసేజీలు, ఫొటోలు, వీడియోల వేధింపులు ఎక్కువవ్వడంతో పోలీసుల్ని ఆశ్రయించాడు శివబాలాజీ.